మూడ్ లేకపోతే మూస్కొని కూర్చో.. నోరు జారిన గౌతమ్!
on Dec 3, 2024
బిగ్ బాస్ హౌస్ లో సోమవారం అనగానే నామినేషన్ ప్రక్రియ అనుకుంటారంతా కానీ సెకెండ్ ఫైనలిస్ట్ ఎవరు కావాలో వారిని సేఫ్ చేయండి.. వద్దనుకున్న వారి ఫోటోని కాల్చేయండి అని బిగ్ బాస్ చెప్పడంతో రచ్చ మొదలైంది. ఇక ముందుగా విష్ణుప్రియ ఫొటోని అవినాష్ కాల్చేసి రేసు నుంచి తప్పించాడు. ఆ తర్వాత గౌతమ్ ఫొటోని విష్ణుప్రియ కాల్చేసింది. ఇక్కడి దాకా సాఫీగానే సాగింది. ఇక ఆ తర్వాత నిఖిల్ ని గౌతమ్ సెకెంఢ్ ఫైనలిస్ట్ కి అనర్హుడు అని చెప్పి రీజన్స్ చెప్పాడు.
నువ్వు నామినేట్ చేస్తున్నప్పుడు కానీ చాలాసార్లు నాకు వినిపించింది ఏంటంటే ఏం పోట్రే చేద్దామనుకుంటున్నావ్ అంటూ నన్ను అంటావ్.. నేను ఫ్యాక్ట్స్ పెట్టినప్పుడు.. అంటూ గౌతమ్ అన్నాడు. దీనికి ఫ్యాక్ట్స్ కాదు.. పాయింట్స్.. అంటూ నిఖిల్ కౌంటర్ ఇచ్చాడు. నా ఉద్దేశంలో కాదు.. ఇక్కడ ఎవరూ ఎవరినీ పోట్రే చేయలేరంటూ గౌతమ్ అన్నాడు. సో ఇక్కడ పోట్రే అన్న పదం వాడినందుకు నాకు ఫినాలేలో ఉండే అర్హత లేదా అంటూ నిఖిల్ కొశ్చన్ చేశాడు. అంటే పోట్రే అన్నది చాలా పెద్ద పదం.. నేను ఏదో నిన్ను బ్యాడ్ వేలో పోట్రే చేస్తున్నానని నువ్వు అన్నావంటూ గౌతమ్ చెప్పాడు. నేను ఆ పదం ఎందుకువాడానంటే ఎవరైనా నిన్ను నామినేట్ చేస్తే ఆ పాయింట్ వదిలేసి అందులోనుంచి ఒక పదం పట్టుకొని ఊరంతా తిరిగి 4-5 గంటలు మాట్లేడేసి 4 సినిమా డైలాగులు కొట్టేసరికి నా నామినేషన్ గట్టిగా చేసుకున్నా అని నువ్వు అనుకుంటున్నావేమో.. కానీ అందులో టైమ్ వేస్ట్ తప్ప ఏం లేదు.. నామినేషన్స్‌లో నేను పోట్రే అన్న పదం వాడినందుకే నేను ఫినాలేలో ఉండకూడదని నువ్వు అనుకుంటే నీ కంటే నాకే అక్కడ ఉండే అర్హత ఎక్కువుందని అర్థం.. అంటూ నిఖిల్ అన్నాడు.
నిఖిల్ మాటలకి అవును ఆడపిల్లల్ని గుంజినవ్ తప్పు కాదా.. అంటూ ప్రేరణ టాపిక్ తెచ్చాడు గౌతమ్. దీంతో ప్రేరణకి నాకు ఉన్న ఇష్యూ నువ్వెందుకు తెస్తున్నావ్.. డిఫెన్స్ లాయరా ఆమెకి.. అంటూ నిఖిల్ కౌంటర్ ఇచ్చాడు. కాదు నా పాయింట్ చెబుతున్నా.. అని గౌతమ్ అంటే నేను చేసింది నీకు ప్రాబ్లమ్ అయిందా నువ్వు చేసింది నాకు అయిందా.. మరి మధ్యలో వీడికేంటి ప్రాబ్లమ్.. అంటూ ప్రేరణతో నిఖిల్ అన్నాడు. నేను ఒకరితో ఉండాలంటే వాళ్లతో ఉంటా నీలాగ ఫ్రెండ్ అని మళ్లీ వాళ్లనే నామినేట్ చేసి నేను సోలోగా ఆడుతున్నానని చూపించుకోను.. ఫ్రెండ్ అయి క్లోజ్ అయి సోలో అని చూపించడానికి నామినేషన్ వేయనంటూ నిఖిల్ అన్నాడు.
ఇక్కడ నువ్వు మాత్రం కాదు మేము కూడా సెల్ఫ్‌గానే వచ్చాం.. ఒకరి దగ్గర ఏం చెప్పావ్ ఇంకొకరి దగ్గర ఏం చెప్పావ్ మాకు తెల్సు.. మాకు తెల్సు భయ్.. అంటూ నిఖిల్ అన్నాడు. చెప్పమంటూ గౌతమ్ అనగా.. నేను చెప్పను నాకు మూడ్ లేదంటూ నిఖిల్ అన్నాడు. మూడ్ లేకపోతే మూస్కొని కూర్చోమంటూ నోరు జారాడు గౌతమ్. నోరు జారకు.. ఏం మాట్లాడుతున్నావ్.. ఏంటి మూసుకొని కూర్చో.. ఇప్పటిదాకా ఎలా మాట్లాడా నేను.. ఏంటిది పెద్ద నోరుజారడం గురించి డిస్‌రెస్పెక్ట్ గురించి మాట్లాడుతున్నాడు.. మూస్కొని కూర్చో అంటున్నాడేందంటూ నిఖిల్ హౌస్‌మేట్స్‌తో అన్నాడు. దీనికి అంటే తప్పేంటి అంటూ గౌతమ్ రివర్స్ ఎటాక్ చేశాడు. మూస్కొని కూర్చో అంటే ఏంటంటూ నిఖిల్ అడుగుతుంటే.. గౌతమ్ అది తప్పంటూ అవినాష్, రోహిణి అన్నారు. నేను ఎలా మాట్లాడాను.. సరే అది నీకు డిస్‌రెస్పెక్ట్ ఫీల్ అయితే సారీ.. అంటూ గౌతమ్ చెప్పాడు. నాకేంటి అందరికీ అనిపించింది.. సారీ నాకు అవసరం లేదు పో.. నువ్వు నోటికొచ్చినట్లు మాట్లాడితే వినడానికి రాలేదు ఇక్కడికి.. నీ దగ్గర వినడానికి నేను రాలేదు.. ఇంకోసారి నోరు జారితే వేరేలా ఉంటదంటూ నిఖిల్ వార్నింగ్ ఇచ్చాడు. ఇక ఇద్దరి మధ్య తీవ్రంగా గొడవ జరిగింది. నిన్నటి ఎపిసోడ్ లో ఇదే హైలైట్ గా నిలిచింది.
Also Read